ఘనంగా వీడ్కోలు సమావేశం
విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం మండల కేంద్రంలోని కల్వల మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల సెకండియర్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులతోపాటు అధ్యాపక బృందం బుధవారం ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించింది. జూనియర్ స్టూడెంట్స్ తో, అధ్యాపకులతో ఉన్న అనుబంధాన్ని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. ప్రిన్సిపల్ పరిమి నవీన్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో జూనియర్ కాలేజ్ దశ ఎంతో కీలకమని, ఇక్కడ పొందిన విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలు వారి భవిష్యత్‌ను దిశానిర్దేశం చేస్తాయన్నారు. అధ్యాపకులు విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకుంటూ విలువైన సూచనలు అందించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక,నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి . కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రమేష్, పార్థసారథి, వీరబాబు, కృష్ణ నాయక్, పూర్ణ నాయక్, చంద్రమోహన్, చంద్రశేఖర్, సోమయ్య, నరసయ్య, వేద ప్రకాష్, ఫిలిప్ శ్వేత, జయ రేఖ, విజయ కుమారి, లలిత, హెల్త్ కేర్ ప్రవళిక, అరుణ బాయ్, యాకన్న , అధ్యాపకేతర తదితరులు పాల్గొన్నారు.



