ఏ ఎన్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
- - పాల్గొన్న ఎలిమినేటి నరసింహ రెడ్డి
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "స్వచ్ఛ భారత్" పిలుపును ఆచరణలో పెట్టేందుకు ANR ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్ మెట్ మండలం, మునగనూరు గ్రామంలో భారీ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జి హెచ్ ఎం సి 53, 56 డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఎలిమినేటి నరసింహ రెడ్డి హాజరయ్యారు. ఆయన గ్రామస్తులతో కలిసి రోడ్లను ఊడ్చడం, చెత్తను సేకరించడం, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడం వంటి పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ఎలిమినేటి నరసింహ రెడ్డి గారు మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు. ఇది ప్రతి పౌరుడి బాధ్యత. పరిశుభ్రమైన పరిసరాలు ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. మన ఇల్లు, వీధి, గ్రామం శుభ్రంగా ఉంటేనే దేశం శుభ్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలి అని పిలుపునిచ్చారు. ఏ ఎన్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు గ్రామంలోని పాఠశాల ప్రాంగణం, దేవాలయ ప్రాంతం, ప్రధాన రహదారులు మరియు బహిరంగ ప్రదేశాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామస్తులకు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. చెత్త రహిత గ్రామంగా మునగనూరును తీర్చిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో, ANR ఫౌండేషన్ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని, పరిశుభ్రతను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.