అంకిరెడ్డి జీవితం చిరస్మరణీయం
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: తెలంగాణ ఉద్యమాన్ని తన కెమెరాతో చరిత్రలో నిలిపిన అంకిరెడ్డి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం హైదరాబాదు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన అంకిరెడ్డి సంస్మరణ సభలో ఆయన ఉద్యమ ప్రస్థానం, ప్రజా ఉద్యమాల పట్ల అంకితభావాన్ని స్మరించుకున్నారు. సభ ప్రారంభంలో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి, అనంతరం అంకిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత మిత్ర రచించిన "ఉప్పెనంటి తెలంగాణ" పాటను విమలక్క ఆలపించగా, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. అంకిరెడ్డి అల్లుడు వినయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అరుణోదయ విమలక్క, రమేష్ పోతుల, మందిరం నాగరాజు, నవీన్ ఆచారి, అంకిరెడ్డి జ్యోతి, బండారి శ్రీనివాస్, కందుకూరి రమేష్ బాబు, ఏపూరి మల్సూర్, రాకేష్ పాల్గొన్నారు.