బాలిక విద్యకు ఆర్థిక సహాయం 

బాలిక విద్యకు ఆర్థిక సహాయం 

విశ్వంభరం, కడ్తాల్ :  పొతేపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య  కుమార్తెకు పై చదువుల కోసం గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్య ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చే శక్తి అని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువు ఆపకూడదని, ముఖ్యంగా బాలికల విద్యకు సమాజం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. సమాజంలోని దాతలు కూడా ముందుకు వచ్చి విద్యార్థులకు ఆర్థికంగా సహకరించాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే కుటుంబం, గ్రామం, రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. వెంకటయ్య గారి కుమార్తె చదువులో మెరుగైన ఫలితాలు సాధించి కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు. ఈ సహాయం ఆమె విద్యాభ్యాసానికి తోడ్పడుతుందని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని బాలిక విద్యకు మద్దతు ప్రకటించారు

Tags: