విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి
- - కార్మిక, గనులశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
- - జక్కాపూర్ జడ్పీ స్కూల్లో డైనింగ్, మీటింగ్ హాల్స్ ప్రారంభం
- - సహకరించిన దాత దొంతుల సుధాకర్‌కు ఘన సన్మానం
విశ్వంభర, సిద్దిపేట: విద్యార్థులు ప్రతీ ఒక్కరు ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకుసాగాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమ ఈ మూడు కలిసినప్పుడే ఏ లక్ష్యమైనా సాధించగలమని పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 50వేల మంది ఉపాధ్యాయులను నియమించిందని గుర్తుచేశారు. నారాయణరావుపేట మండలం జక్కాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో
దొంతుల సుధాకర్ రూ.40లక్షల ఆర్థికసాయంతో నిర్మించిన డైనింగ్ హాల్, మీటింగ్ హాల్, కిచెన్ షెడ్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారిని అభినందించారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ పాఠశాలకు డైనింగ్, కిచెన్ నిర్మాణానికి సహకరించిన దాత దొంతుల సుధాకర్, కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సుధాకర్‌ను ఆదర్శంగా తీసుకుని ఊరిలోని పెద్దలు కూడా సమాజానికి తమవంతుగా సేవ చేయాలని కోరారు. పాఠశాల విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల అంకితభావం, సాధిస్తున్న ఫలితాలన్నీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలోనే కనిపిస్తున్నాయని కితాబిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని అభినందించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల క్రమశిక్షణ, నిబద్ధత తనను ఆకట్టుకున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. మౌలిక సదుపాయాల పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ అధిగమించి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించడం నిజంగా అభినందనీయమన్నారు. అందుకు జక్కాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ ధాన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల కోసం ఉదయం అల్పాహార, మధ్యాహ్న భోజన పథకంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా పెరిగిందని చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం, జిల్లా ఇన్‌చార్జి డీఈవో, జడ్పీ సీఈఓ రమేశ్, గ్రామ సర్పంచ్ భానుచందర్, డైనింగ్ హాల్ దాత సుధాకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ, ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ విద్యాసాగర్, ఎస్ఐలు చంద్రమోహన్, నవత, నాయకులు చింతల రాజ్‌వీర్, బుచ్చెల్లి రవి, విజయ్ రెడ్డి పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ ఛైర్మన్ల అలక..
మంత్రి వివేక్ కార్యక్రమంలో నంగునూర్, చిన్నకోడూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్లు దేవులపల్లి యాదగిరి, మీసం మహేందర్ యాదవ్ అలకబూనారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా తమను స్టేజీ పైకి ఆహ్వానించలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమం నడుస్తుండగానే యాదగిరి, మహేందర్ తమ డైరెక్టర్లతో కలిసి మధ్యలోనే వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును ఆహ్వానించేందుకు వెళ్లినప్పటికీ అసలు విషయం మాత్రం వేదికపైకి పిలవకపోవడం వల్లేనని సన్నిహితుల దగ్గర వాపోయారు. మైనంపల్లి సర్దిచెప్పడంతో ఛైర్మన్లు శాంతించారు. కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకుందామని మైనంపల్లి పిలుపునిచ్చారు. డైనింగ్ హాల్ నిర్మాణానికి సహకరించిన దాత సుధాకర్‌ను అభినందించి ఘనంగా సత్కరించారు.