స్టూడెంట్ లీగల్ లిటరసీ క్లబ్ ల ప్రారంభం
విశ్వంభర, మహబూబాబాద్: విద్యార్థి దశ నుంచే షెడ్యూల్ తెగలకు చెందిన బాల బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో జాతీయ న్యాయ సేవధికార సంస్థ రూపొందించిన "సంవాద్" పథకం లో నిర్దేశించిన విధంగా మహబూబాబాద్ జిల్లాలో షెడ్యూల్ తెగల కు చెందిన విద్యార్థుల కోసం రెండు పాఠశాలలలో శనివారం స్టూడెంట్ లీగల్ లిటరసీ క్లబ్ లు ప్రారంభించారు. బయ్యారం ఏకలవ్య గురుకుల పాఠశాల మరియు మహబూబాబాద్ బాలికల గిరిజన పాటశాల లో ఈ క్లబ్ లను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో 9 మరియు 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు మొత్తం 40 మందితో కలిపి ఈ లిటరసి క్లబ్ ల ను ఏర్పాటు చేశారు. ఆయా పాఠశాలకు చెందిన ఒక టీచర్ ఈ క్లబ్ కు ఇంచార్జి గా వ్యవహరిస్తారు. న్యాయ సేవా సంస్థకు చెందిన ప్యానల్ న్యాయవాదులు నెలలో ఒక రోజు పాఠశాలను సందర్శించి క్లబ్ సభ్యులకు వివిధ చట్టాలపై అవగాహన కలగజేస్తారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి పాఠశాల నుండి వెళ్లిపోయే నాటికి విద్యార్థిని విద్యార్థులు చట్టాల పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకుంటారనేది ఈ ప్రక్రియ ఉద్దేశం. వివిధ విద్యార్థి క్లబ్ ల మధ్య పోటి తత్వాన్ని పెంపొందించడానికి ఆయా క్లబ్ ల మధ్య న్యాయ సేవా సంస్థ క్విజ్, వ్యాసర పోటీలను నిర్వహించనుంది. న్యాయవాదులు బి. దేవి, జి. సునీత కమల్ కుమార్ లు స్టూడెంట్ లీగల్ లిటరసీ క్లబ్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించనున్నారు.