బాధ్యతలు చేపట్టిన పరిగి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
విశ్వంభర, పరిగి: పరిగి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సమక్షంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ కుడుముల రజిత వెంకటేష్,
వైస్ ఛైర్మన్ హనుమంతు, కౌన్సిలర్ సభ్యులు బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిగి మున్సిపల్ అభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తామని, ప్రజలకు ఏ సమస్య ఉన్న బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో మున్సిపల్ అభివృధి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నిక కాబడిన కౌన్సిలర్ల ప్రజల అభీష్టం మేరకే పని చేయాలని ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. పరిగి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృదే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాబోయే రోజుల్లో మరిన్ని విధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, సిద్ధాంతి పార్థసారథి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, కుల్కచర్ల మార్కెట్ చైర్మన్ ఆంజనేయులు,కాంగ్రెస్ నాయకులు పాలాది శ్రీనివాస్ గుప్తా, బాదం శ్రీనివాస్ గుప్తా, అక్బర్, రియాజ్, నజీర్, సర్వర్, జగన్, బాలు,తదితరులు పాల్గొన్నారు.



