ఘనంగా మాతృభాషా దినోత్సవం  

ఘనంగా మాతృభాషా దినోత్సవం  

విశ్వంభర, రామన్నపేట:  యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని శ్రీహిందూ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ డా.పనకంటి భాస్కర్ రావు మాట్లాడుతూ, మన మాతృభాష  తెలుగును కాపాడుకున్నప్పుడే మన దేశం మనుగడను కాపాడుకోగలమని, తీయనైన తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని, దీనికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్-ప్రిన్సిపల్ శ్రీమతి డి.శ్రీదేవి, చేపూరి సతీష్ కుమార్, లింగస్వామి, సునీల్ కుమార్, శివ కుమార్, వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: