ఘనంగా తిప్పర్తిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

విశ్వంభర, తిప్పర్తి :- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  తిప్పర్తి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో....గ్రామ సర్పంచ్  బద్దం రజిత సుధీర్ఆ ధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి సంబరాలు ఘనంగా నిర్వహించారు. దశాబ్దాల పోరాట ఫలితంగా ఈనాటి తెలంగాణ ఆవిర్భవించిందని సర్పంచ్ రజిత అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో భాగంగా, తిప్పర్తి మండల కేంద్రంలో ఉద్యమం ఉదృతంగా చేయడం జరిగిందని అన్నారు.102 రోజుల నిరవధిక రిలే నిరాహార దీక్షలతో, తిప్పర్తి మండల జాయింట్ యాక్షన్ కమిటీ తిప్పర్తి మండలం లో ఉద్యమకారులను ఒక సైన్యంగా నడిపించిందని అన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆనాటి ఉద్యమకారులు పాశం నరేష్ రెడ్డి, ఆదిమూలం ప్రశాంత్ లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.  సన్మాన గ్రహీతలు ఆనాటి ఉద్యమకారులు పాశం నరేష్ రెడ్డి మాట్లాడుతూ..నీళ్లు, నిధులు, నియమాకాల కోసం కుల,మత, వర్గ బేధం లేకుండా సబ్బండ వర్గాలు తీవ్రంగా ఉద్యమంచడం జరిగిందని అన్నారు. వేల మంది విద్యార్థులు, యువకుల బలిదానాలకు చలించిన సోనియా గాంధీ, తెలంగాణ ప్రకటన చేసిందని గుర్తు చేశారు. కానీ సీమాంధ్ర నాయకులు పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై, తెలంగాణను అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన సోనియా గాంధీ, పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లును ఆమోదించి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చింది.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గద్దెనెక్కిన పాలకులు తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, సత్కరించి, సముచితమైన గౌరవం అందిస్తుందనీ అన్నారు.తెలంగాణ యుద్ధం నౌక గద్దర్ ను, కవి అందెశ్రీని, ప్రొఫెసర్ కోదండ రామ్ లను సముచితమైన రీతిలో గౌరవించింది. మాజీ పిసిసి అధ్యక్మాజీ, మాజీ రాజ్యసభ సభ్యుడు కేశవరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి సంక్షేమ పథకాలు, సముచిత గౌరవస్థానం కల్పించడానికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.  జరిగిన కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, గ్రామ ఉపసర్పంచ్ దేవకమ్మ, గ్రామ కార్యదర్శి, గ్రామ పంచాయతీ సిబ్బంది,వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్ జాకటి మోష, మాజీ ఎంపీటీసీలు కిన్నెర అంజి, పల్లె ఎల్లయ్య, కుక్కల రమేష్ రెడ్డి, బద్దం సైదులు,మహమ్మద్ గౌస్, జావేద్, జానీ, తండు సతీష్, నలపరాజు శ్రీను, మెరుగు గోపి, లవిశెట్టి లక్ష్మణ్, వంగూరి కిరణ్, వంగూరి బన్నీ తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/telangana-independence-day-celebrations-in-grand-style/article-16126

Tags: