మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ
On
విశ్వాంభర, పెద్ద శంకరంపేట: మలేరియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారిని డాక్టర్ నవ్య హాజరై మలేరియా వ్యాధి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య సిబ్బందికి సూచించారు. ఈ ర్యాలీ ఆరోగ్య కేంద్రం నుండి మొదలై గ్రామ పురవీధుల గుండా వెళుతూ మలేరియా నివారణకు చేపట్టాల్సిన చర్యలపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఈఎంఓ డాక్టర్ వికాస్, ఎంపీహెచ్ఓ యాదయ్య, ఎంపీహెచ్ఎస్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.



