తుమ్మలూరులో పెండింగ్ పనుల పరిశీలన 

తుమ్మలూరులో పెండింగ్ పనుల పరిశీలన 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం  తుమ్మలూరు గ్రామంలో సుమారు 4 సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ సర్పంచ్ తుమ్మటి అండాలు కృష్ణ యాదవ్  ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గత కొంతకాలంగా ఆర్ అండ్ బి  అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్‌తో సమన్వయం చేస్తూ, పలుమార్లు ప్రతినిధులతో కలిసి అధికారులను కలసి రిప్రెసెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ కృషికి స్పందించిన అధికారుల బృందం  తుమ్మలూరు గ్రామాన్ని సందర్శించి, పెండింగ్ పనులపై స్థల పరిశీలన నిర్వహించారు. రోడ్డుకు మధ్యలో ఉన్న కల్వర్ట్ నిర్మాణాన్ని ముందుగా పూర్తి చేసి, అనంతరం మిగిలిన రోడ్డు పనులను పూర్తి చేస్తామని ఆర్ అండ్ బి అధికారులు తెలియజేశారు. సర్పంచ్ తుమ్మటి అండాలు కృష్ణ యాదవ్  ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యని పరిష్కారం చేయడం కోసం అధికారుల బృందంతో కలిసి పర్యటించటం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మటి అండాలు కృష్ణ యాదవ్ , ఆర్ అండ్ బి   అధికారులు, మిషన్ భగీరథ అధికారులు,  గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: