విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా .
విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మున్సిపాలిటీ బేతోలు గ్రామంలోనీ బీసీ కాలనీ లో ఇండ్ల పై ఉన్న 11 కెవి విద్యుత్ వైరు తెగి పెను ప్రమాదం తప్పింది అని అధికారుల నిర్లక్ష్యంతో భయాందోళనతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని , విద్యుత్ సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని విద్యుత్ అధికారులు. గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా బేతో ల్ గ్రామస్తులకు (Kvps) సంగం సంఘీభావం తెలిపి అనంతరం కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డెల రామ్మూర్తి , కెవిపిఎస్ పట్టణ అధ్యక్షులు గద్దపాటి సంతోష్ , ధర్నాలో పాల్గొన్నారు . మరియు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బేతో ల్ గ్రామస్తులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు షేక్ ఖాదర్ బాబా , గ్రామస్తులతో కలిసి జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం ముందు విద్యుత్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ధర్నా చేపట్టారు . అనంతరం షేక్ ఖాదర్ బాబా , దుడిల రామ్మూర్తి లు మాట్లాడుతూ 6వ వార్డు బేతోలు గ్రామంలో బీసీ కాలనీ లో ఇండ్లపై నుంచి వెళ్లిన 11 కెవి విద్యుత్ లైన్ కారణంగా ప్రాణాపాయం నెలకొన్నదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు .
అధికారుల నిర్లక్ష్యంతో ఈమధ్య కురిసిన వర్షానికి బిసి కాలనీలో కరెంటు వైర్ తెగి ఇండ్ల మధ్యన పడటంతో టీవీలు ఫ్యాన్లు ఖాళీ ప్రాణ నష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పింది. గ్రామస్తుల వివరాల ప్రకారం. బీసీ కాలనీలో పలు ఇళ్లపైగా 11 కెవి హైటెన్షన్ లైన్ వెళ్లడం వల్ల ఎప్పటికప్పుడు ప్రమాదాలు సంభవించే పరిస్థితి ఏర్పడిందన్నారు. పిల్లలు వృద్దులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల ముప్పు మరింత పెరిగిందని బిసి కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బిసి కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ప్రమాదం జరిగే వరకు అధికారులు స్పందిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఏ క్షణంలోనైనా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతఅధికారులు స్పందించి. క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు . గ్రామంలోనీ కరెంట్ సబ్ స్టేషన్ మొగిలిచర్ల జెగ్య తండా ఫీడర్ నుండి ప్రస్తుతం గ్రామానికి సరఫరా అవుతుంది కానీ కరెంట్ రాత్రి పగలు రెండు నుండి నాలుగు గంటల పాటు కరెంటు సరఫరా నిలిచిపోతుందని చెప్పారు . దీంతో ప్రజలు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు . కాబట్టి మహబూబాద్ టౌన్ నుండి బేతోలు 6వ వార్డుకు విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని వారు అధికారులను కోరారు . ధర్నా అనంతరం సీనియర్ అకౌంటెంట్ రమాదేవి కి వినతి పత్రం అందజేశారు .
ఈ కార్యక్రమంలో జినుక ఎల్లయ్య, షేక్ యాకుబ్, గడ్డం షేక్ జావిద్, గుండపల్లి వెంకటేష్, షేక్ ఇమ్రాన్, గడ్డం చెన్నయ్య, షేక్ సోషల్, ఎర్రం వరుణ్, షేక్ హిమాయితుల్లా, దూది కట్ల దేవమ్మ, ఆడేపు ఉమా, సకినం రత్న, గుండపల్లి లచ్చమ్మ, షేక్ మీనా, గుండెపల్లి కవిత, షేక్ జానీబి. తదితరులు పాల్గొన్నారు .