మోకుదెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్యాంసుందర్ గౌడ్

విశ్వంభర, హుస్నాబాద్:  గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన పాకాల శ్యాంసుందర్ గౌడ్ నియమితులయ్యారు. జిల్లా, మండల, గ్రామ కమిటీల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర కమిటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం మాట్లాడుతూ గౌడ గీత కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంస్థ చేపడుతున్న ఉద్యమాలు, కార్యక్రమాలను జిల్లాలో మరింత బలోపేతం చేయడంలో శ్యాంసుందర్ గౌడ్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నియామకంపై స్పందించిన శ్యాంసుందర్ గౌడ్ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి నర్స గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగుల సిద్ది రాములు గౌడ్‌తో పాటు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గౌడ గీత కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అంకితభావంతో పనిచేస్తానని, జిల్లాలో సంస్థను మరింత బలోపేతం చేసి రాష్ట్ర కమిటీ ఆశయాల సాధనకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/shyamsunder-goud-as-the-chief-secretary-of-mokutabama-district/article-18971

Tags: