సీఎం రేవంత్ రెడ్డికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన శశిధర్ రెడ్డి
On
విశ్వంభర,హైదరాబాద్ : చైతన్యపురి డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు కె. శశిధర్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తిరుమలలో సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన శశిధర్ రెడ్డి సిఎం కు వారి కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి,నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ కు చెందిన శశిధర్ రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి స్వామి వారి దర్శనానికి వెళ్లారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంగళవారంస్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన శశిధర్ రెడ్డి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపి సిఎం ఆశీస్సులు తీసుకున్నారు..jpeg)



