కాలు తొలగించాల్సిన వృద్దుడిని కాపాడిన వైద్యులు

విశ్వంభర, హనుమకొండ:మధుమేహం ఉన్న వృద్ధుల్లో పాదంపై ఏర్పడే చిన్న గాయం కూడా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాలికి రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో తీవ్ర అడ్డంకులు ఏర్పడితే,కాలి వేళ్లు కుళ్లిపోవడం (గ్యాంగ్రీస్),కాలు తొలగించాల్సిన పరిస్థితి, కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. హనుమకొండ  లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ
 సర్జన్ డాక్టర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ...ఇటువంటి క్రిటికల్ లింబ్ థ్రెటెనింగ్ ఇస్కీమియా వంటి ప్రమాదకర పరిస్థితుల్లో సకాలంలో రక్తప్రసరణను పునరుద్ధరించే ఆధునిక వాస్క్యులర్ శస్త్రచికిత్సలు అవయవాన్ని కాపాడడమే కాకుండా రోగి జీవన నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి. అటువంటి క్లిష్టమైన కేసులో, మలక్ పేట లోని యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వాస్క్యులర్ సర్జరీ నిపుణులు వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన 81 ఏళ్ల కుసుమ భద్రయ్య కాలును తొలగించాల్సిన పరిస్థితి నుంచి విజయవంతంగా కాపాడారు. కుడి కాలి మూడో వేలు గ్యాంగ్రీస్కు గురవడంతో ఆసుపత్రికి వచ్చిన ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కాలికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమనిలో తీవ్ర అడ్డంకి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.వైద్య పరీక్షల్లో ఆయనకు రైట్ ఫెమొరో- పాప్లిటియల్ ఆక్లూజివ్ డిసీజ్ తో కూడిన క్రిటికల్ లింబ్ థ్రెటెనింగ్ ఇస్కీమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇప్పటికే టైప్-2 మధుమేహం, రక్తపోటు కూడా ఉండటంతో కాలు పూర్తిగా తొలగించాల్సిన ప్రమాదం ఉందని గుర్తించిన వైద్య బృందం అత్యవసరంగా అవయవాన్ని కాపాడే వాస్క్యులర్ టైపాస్ శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించింది.అత్యాధునిక వాస్క్యులర్ లింబ్-సాల్వేజ్ శస్త్రచికిత్స కన్సల్టెంట్ వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జన్ డా. రంజిత్ కుమార్ ఆనందసు ఆధ్వర్యంలో రోగికి రైట్ ఫెమొరో-పాప్లిటియల్ టైపాస్ శస్త్రచికిత్సతో పాటు గ్యాంగ్రీస్కు గురైన కుడి కాలి మూడో వేలిని తొలగించే శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు.మధుమేహం కారణంగా కాళ్లకు రక్త ప్రసరణ తగ్గి గ్యాంగ్రీను గురయ్యే రోగుల్లో సకాలంలో సరైన వాస్కులర్ చికిత్స అందిస్తూ పెద్ద ఎత్తున అవయవాలను కాపాడవచ్చనిఈ కేసు మరోసారి నిరూపించిందని యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మలక్పేట యాజమాన్యం తెలిపింది. అత్యధిక వ్యాస్క్లర్ ఆపరేషన్ థియేటర్లు. ఆధునిక ఇమేజింగ్ సదుపాయాలు.అనుభవజ్ఞులైన వాస్క్యులర్ సర్జన్లు. కార్డియాలజిస్టులు. ఎండోకైనాలజిస్టులు.నెఫ్రాలిల జిస్టులతో. కూడిన సమన్వయ 
 వైద్య బృందం ద్వారా తెలంగాణలో అత్యంత క్లిష్టమైన రక్తనాళాల వ్యాధులకు కూడా సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి డైరెక్టర్ గోరకంటి పవన్ యూనిట్ హెడ్ కె. శ్రీనివాస్ రెడ్డి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదిరి తెలిపారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-doctors-saved-the-old-man-who-had-to-have/article-18873

Tags: