గోల్కొండ బోనాలకు పోటెత్తిన భక్తులు.. శివసత్తుల నృత్యాలతో ఆధ్యాత్మిక సందడి.

అమ్మవారి దర్శనానికి వేలాది భక్తులు..

గోల్కొండ జగదాంబిక అమ్మవారి రెండో బోనం సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు.
అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళా భక్తులు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు.

Golconda Bonalu 2026: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆదివారం రెండో బోనం పూజ వైభవంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు పరిసర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు గోల్కొండ కోటకు చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో గోల్కొండ కోట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ, ఆలయ ట్రస్ట్ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలు, ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Read More ఘనంగా శ్రీ జగన్నాథ రథోత్సవం 

🕒 19 Jul 2026 ✍️ Desk

గోల్కొండ బోనాలకు పోటెత్తిన భక్తులు.. శివసత్తుల నృత్యాలతో ఆధ్యాత్మిక సందడి.

అమ్మవారి దర్శనానికి వేలాది భక్తులు..

Golconda Bonalu 2026: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆదివారం రెండో బోనం పూజ వైభవంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు పరిసర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు గోల్కొండ కోటకు చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో గోల్కొండ కోట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ, ఆలయ ట్రస్ట్ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలు, ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

🔗 https://www.vishvambhara.com/devotional/devotees-flocked-to-the-golconda-bonas-for-the-second-puja/article-18850

Tags: