ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ
విశ్వంభర, హైదరాబాదు : కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. హైదరాబాదులోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ వద్ద గురువారం నిర్వహించిన ఆందోళనలో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా మూసివేత వైపు వెళ్లడం దుర్మార్గమని విమర్శించారు. ఫీజుల నియంత్రణతో పాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళన సందర్భంగా పోలీసులు లాఠీచార్జీ చేసి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. దీనిని రాష్ట్ర కమిటీ ఖండించింది. ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై వచ్చిన ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో: రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్, కె. అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.వై. ప్రణయ్, కార్తీక్, లెనిన్ గువేరా, రమేష్, వెన్నెల, శ్రీకాంత్, లిఖిత్, చరణ్, తరంగ్, అరుణ్, నాగేందర్, స్టాలిన్, వినోద్, శ్రీరామ్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.