అంబేద్కర్ యువజన సంఘం ఆవిర్భావం
విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలోని మల్కాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆవిర్భావం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై సంఘం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమానత్వం, న్యాయం కోసం యువత ముందుండి కృషి చేయాలని సూచించారు. సంఘం అధ్యక్షుడిగా ఎర్రోళ్ల ప్రశాంత్ కుమార్, వైస్ ప్రెసిడెంట్లుగా నీరడీ శ్రీకాంత్, కందుకూరి మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా తలారి శివరామ్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా కందుకూరి రాజ్ కుమార్, కలకుంట్ల కుమార్, కోశాధికారిగా ఎర్రోళ్ల దుర్గయ్య బాధ్యతలు స్వీకరించారు. ఆర్గనైజర్ సెక్రెటరీగా ప్యాట వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కళాకారుల బృందానికి తొగర్పల్లి విద్యాసాగర్, క్రీడాల బృందానికి నీరడీ నరసింహులు నాయకత్వం వహించనున్నారు. సోషల్ మీడియా విభాగాన్ని మామిడిపల్లి నిఖిల్, ఎర్రోళ్ల సంపత్ కుమార్ నిర్వహించనున్నారు. గౌరవ అధ్యక్షులుగా నీరడీ సంజీవులు, ఎర్రోళ్ల సామ్యూల్ ఉండగా, సలహాదారులుగా జి. బుచ్చయ్య, కందుకూరి కృష్ణ, ఎర్రోళ్ల మైపాల్, నీరడీ విజయ్ భాస్కర్, పొట్ట దానియేలు, ఎర్రోళ్ల పాపయ్య, కందుకూరి రాములు, బాయికాడి అశోక్, బేగరి సురేష్, నియమితులయ్యారు.



