కళాకారులను ప్రోత్సహించాలి: మంత్రి పొన్నం

విశ్వంభర, హైదరాబాద్: కళాకారుల ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ కులవృత్తులను పరిరక్షించడంతో పాటు వేలాది కుటుంబాలకు అండగా నిలవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆషాఢ బోనాల సందర్భంగా హైదరాబాదు హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కులవృత్తుల మేళాకు నగర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని మంత్రి తెలిపారు. 60 స్టాళ్లతో 15 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ మేళాను ఆదివారం సెలవు దినాన్ని సద్వినియోగం చేసుకొని కుటుంబ సమేతంగా సందర్శించాలని కోరారు. బోనాల పండుగకు అవసరమైన కుండలు, బుట్టలు, మట్టి పాత్రలు తదితర సంప్రదాయ వస్తువులను కొనుగోలు చేసి బీసీ కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు. మేళాలో టెర్రకోట ఉత్పత్తులు, మట్టి పాత్రలు, మేదర బుట్టలు, గద్వాల్, పోచంపల్లి, నారాయణపేట చేనేత వస్త్రాలు, నిర్మల్ కళాఖండాలు, పెంబర్తి ఇత్తడి కళాఖండాలు, వరంగల్ దుర్రీలు, పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలు, సేంద్రీయ ఆహార ఉత్పత్తులు తదితర వస్తువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ కళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/minister-ponnam-should-encourage-artists/article-18887

Tags: