పెన్షనర్లకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలి

  • ఐక్య ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం సాధ్యం

విశ్వంభర, హైదరాబాదు : 30–35 ఏళ్లపాటు ప్రభుత్వ సేవ చేసిన పెన్షనర్లు గౌరవప్రదమైన జీవితం గడిపేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, పెన్షనర్లకు ఇబ్బందులు కలిగిస్తున్న నిబంధనలను పునఃసమీక్షించి న్యాయం చేయాలని ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్్జీపీఎఫ్) అధ్యక్షుడు సురేంద్ర చౌదరి అన్నారు. పెన్షనర్ల సమస్యలు ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవు తాయి. కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలకు తగ్గించి, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి అని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వజీర్ సింగ్ కోరారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు మంగళవారం హైదరాబాదు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సురేంద్ర చౌదరి అధ్యక్షతన జరిగాయి. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టీఏపీఆర్‌పీఏ) ఆతిథ్యమిచ్చిన ఈ సమావేశాలకు దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 72 మంది ప్రతినిధులు హాజరై పెన్షనర్ల సమస్యలు, సంక్షేమ అంశాలపై చర్చించారు. ప్రధాన అతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీకుమార్ మాట్లాడుతూ, పెన్షనర్లకు కల్పించే సౌకర్యాలు ప్రభుత్వ ఔదార్యం కాదని, వారి హక్కులని అన్నారు. కోవిడ్ సమయంలో నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని కోరారు. ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో టీఏపీఆర్‌పీఏ అధ్యక్షుడు ఎం.ఎన్. రెడ్డి, నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి జి. అశోక్, ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు డా. అరుణ, స్వరాజ్ కుమార్, కొండలరావు, యు. అంజనేయులు, నరహరి, జనార్దన్ రెడ్డి, రామచంద్రుడు, వైకుంఠరావు, కృష్ణమోహన్, లక్ష్మీనారాయణ, కమల కుమారి, కృష్ణారావు, నాగేశ్వరరావు ,అశోక్ తదితరులు పాల్గొన్నారు

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/pensioners-should-be-given-a-dignified-living/article-18172

Tags: