విప్లవ యోధుడు నాగన్న సంతాప సభకు తరలి రావాలి

విశ్వంభర,నెల్లికుదురు:హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 25న జరగనున్న కా.అరుణోదయ నాగన్న సంతాప సభకు భారీగా తరలిరావాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల  లింగన్న పార్టీ శ్రేణులకు,శ్రేయోభిలాషులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలంలోని శనగకుంట తండాలో శనివారం సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ నాగన్న కేవలం గాయకుడు కాదు, దోపిడీ వ్యవస్థపై తన పాటలతో ప్రజల్లో చైతన్యం రగిలించిన విప్లవ సాంస్కృతిక యోధుడు అన్నారు.ఆయన మరణం ప్రజాస్వామ్య స్వరాలకు తీరని లోటని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను పక్కనబెట్టి పాలక వర్గాలు కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్న ఈ సమయంలో నాగన్న వంటి స్వరాలు మరింత అవసరమని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడం అంటే ప్రజా పోరాటాలను మరింత బలోపేతం చేయడమేనని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నక్క యాకన్న, చిర్రా యాకన్న, మైబు,వెంకన్న, లక్ష్మి, కమిలి సుందర్, బాలాజీ, శ్రీను, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/revolutionary-warrior-naganna-should-come-to-the-mourning-house/article-18895

Tags: