తెలంగాణ ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు.. సీతక్క స్పందన

తెలంగాణ ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు.. సీతక్క స్పందన

నగరంలో ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రజాభవన్‌లో బాంబు ఉందని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే ప్రజా భవన్‌ వద్దకు బాంబు స్క్వాడ్ సిబ్బంది చేరుకుని తనిఖీలు చేపట్టారు.

నగరంలో ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రజాభవన్‌లో బాంబు ఉందని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే ప్రజా భవన్‌ వద్దకు బాంబు స్క్వాడ్ సిబ్బంది చేరుకుని తనిఖీలు చేపట్టారు. చివరికి అది ఆకాయిలు చేసిన పనిగా పోలీసులు నిర్ధారించారు. 

ఈ మధ్య కాలంలో బాంబు బెదిరింపు ఘటనలు ఎక్కువయ్యాయి. సాధారణ ఎయిర్ ఇండియా విమానాలకు ఇలాంటి బెదిరింపులు సర్వసాధారణమయ్యాయి. తాజాగా మంగళవారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రాగా ప్రయాణికులను సిబ్బంది వెంటనేకిందకు దింపేశారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే హైదరాబాద్‌లో రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపు రావడం గమనార్హం. 

Read More పుత్రోత్సాహంలో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

మరోవైపు ఈ ఫేక్ ఫోన్ కాల్‌పై మంత్రి సీతక్క స్పందించారు. తాము ప్రజలకు స్వేచ్ఛగా ప్రజాభవన్‌లోకి వచ్చే అవకాశం ఇస్తే ఇలాంటివి జరుగుతున్నాయి. ఎవరైనా రావొచ్చని తాము ప్రజాభవన్ గేట్లు ఓపెన్ చేసి పెడుతున్నామని తెలిపారు. కొందరు కావాలనే ఇలాంటి కాల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తాము కష్టాలను చెప్పుకునేందుకు ప్రజాభవన్‌లోకి అందరినీ అనుమతిస్తోందని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని నిజానిజాలు బయటకు వస్తాయని మంత్రి స్పష్టం చేశారు.