డిసెంబర్ 25 న చండూర్ లో రాపోలు వీరమోహన్ పర్యటన - చేనేత సమస్యలపై కార్మికులతో సమావేశం. 

డిసెంబర్ 25 న చండూర్ లో రాపోలు వీరమోహన్ పర్యటన - చేనేత సమస్యలపై కార్మికులతో సమావేశం. 

విశ్వంభర, హైదరాబాద్ :- చేనేత సమస్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టిన తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ తేదీ 25-12-2025 గురువారం నాడు చండూర్ మున్సిపాలిటీలో పర్యటించనున్నట్లు తుర్క యంజాల్ లోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల సమస్యలపై తన గళం వినిపిస్తూ వస్తున్నా రాపోలు వీరమోహన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చేనేత సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేనేత రుణమాఫీ పై పలు అనుమానాలు అలాగే బ్యాంకు, ప్రభుత్వం కార్మికుల రుణాల పై ఎక్కడలేని ఆంక్షలు విధించడం  దారుణం అని అన్నారు. చేనేత కార్మికులకు ఉన్న సమస్యలపై(థ్రిఫ్టు ఫండ్ , లోన్ ల మంజూరి.. రుణమాఫీ , పలు అంశాలు , ) రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ చండూర్ మున్సిపాలిటీ కి రావడం జరుగుతుంది. చేనేత కార్మికులంతా స్థానిక శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 10 గంటలకు  ఈ కార్యక్రమం ఉంటుందని చేనేత ఐక్య వేదిక సోషల్ మీడియా కార్యదర్శి - రావిరాల శ్రీనివాస్ నేత మీడియా సమావేశంలో తెలిపారు. అలాగే చేనేత కార్మిక సంఘం చండూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు రాపోలు వెంకటేశం కార్మికులను సమావేశపరుస్తానని తెలిపారు. తప్పకుండ చండూర్ లో గురువారం చేనేత కార్మికుల సమస్యలపై కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందని కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి జెల్ల రఘు , చెరుకు మల్లయ్య , గ్రేటర్ హైదరాబాద్  చేనేత ఐక్య వేదిక ఉపాధ్యక్షులు చెరుకు విజయ్ తదితరులు పాల్గొన్నారు.  

Tags: