గర్భధారణ నుంచి రెండేళ్ల వరకు అత్యంత కీలకం
: ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ
విశ్వంభర, రాజేంద్రనగర్: పిల్లల భవిష్యత్తుకువారి శారీరక మానసిక ఎదుగుదలకు మొదటి 1000 రోజులు అత్యంత కీలకమైనవని ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజా పేర్కొన్నారు. మైలర్‌దేవ్‌పల్లి సెక్టార్ పరిధిలోని దశర బస్తీ అంగన్‌వాడీ కేంద్రంలో “మొదటి 1000 రోజులు – బిడ్డ జీవితానికి బలమైన పునాది” అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రం టీచర్ సుమిత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పద్మజా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గర్భధారణ ప్రారంభమైనప్పటి నుండి బిడ్డకు రెండేళ్లు పూర్తయ్యే వరకు ఉన్న కాలాన్నే 'తొలి 1000 రోజులు'గా పేర్కొంటారని ఆమె వివరించారు. ఈ దశలో పిల్లలకు సరైన పోషణ, తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణ ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మజా మాట్లాడుతూ.. తొలి 1000 రోజుల్లోనే బిడ్డ మెదడు అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుందని తెలిపారు. ఈ సమయంలో అందించే పోషకాలు శారీరక ఎదుగుదలను బలపర్చడమే కాకుండా, రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయన్నారు. సరైన పోషకాహారం అందించడం ద్వారా పిల్లల్లో భవిష్యత్తులో వచ్చే పోషకాహార లోపాలు, ఎదుగుదల లోపాలను పూర్తిగా నివారించవచ్చని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు వకులదేవి, అనిత, సభిత, కే. అనిత, మాధవి, రత్న, రాజేశ్వరి, వెంకటేశ్వరమ్మ, సుజాత, భానుప్రియ, వరలక్ష్మి తదితరులతో పాటు స్థానిక గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.