సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపాలిటీ కొరడా

  • నిబంధనలు ఉల్లంఘించిన షాపులకు జరిమానా

విశ్వంభర,  హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ టీ. మల్లికార్జున్ ఆదేశాల మేరకు మున్సిపల్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వ్యాపార సంస్థలపై ప్లాస్టిక్ రైడింగ్ నిర్వహించారు. తనిఖీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై మొత్తం రూ.6 వేల జరిమానా విధించారు. రాజస్థాన్ ఆశాపూరి స్వీట్ హౌస్‌కు రూ.1,000, ఆర్ఎస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు రూ.500, ఎస్‌ఎల్‌వీ బెంగళూరు బేకరీకి రూ.1,000, రాందేవ్ జనరల్ స్టోర్స్‌కు రూ.1,000, మైసూర్ బేకరీకి రూ.1,500, హనుమాన్ జనరల్ స్టోర్స్‌కు రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా అధికారులు వ్యాపారులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించారు. భవిష్యత్తులో కూడా నిబంధనలు ఉల్లంఘించే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రవికుమార్, జవాన్ శ్రీకాంత్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/municipal-whip-on-single-use-plastic/article-18184

Tags: