ధర్పల్లి లో రోడ్డు భద్రతా వారోత్స వాలు

ధర్పల్లి లో రోడ్డు భద్రతా వారోత్స వాలు

విశ్వంభర, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సీఐ బిక్షపతి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ధర్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ భవనంలో అరైవ్  అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాలు ఎస్సై వినయ్ నిర్వహించారు. గ్రామస్తులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు  తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామస్థాయిలో విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీ వి.ఆర్.ఎస్.సి న్యూ ఏర్పాటు చేసి కమిటీ సభ్యుల వారి బాధ్యతలు కర్తవ్యాలను గుర్తు చేశారు. అదేవిధంగా గ్రామస్తులు అందరూ రోడ్డు భద్రతపై ప్రమాణం చేయించారు. గ్రామ సభలో తీర్మానాలు మైన డ్రైవింగ్ పూర్తిగా నిషేధం రోడ్డుపై విత్తనాలు ధాన్యం ఆరబెట్టేయడం నిషేధం, హెల్మెట్ వినియోగం తప్పనిసరి ఆనందంగా గ్రామ భద్రత ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం గ్రామస్తుల సహకారంతో రాత్రి గస్తీ దళాలు ఏర్పాటు చేయడం ప్రమాదాలు తగ్గించి ప్రాణాలను రక్షించడమే గ్రామ భద్రతను బలోపేతం చేయడమే మన లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో. ధర్పల్లి ఎస్సై వినయ్,  పోలీస్ సిబ్బంది,. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గ్రామపంచాయతీ సభ్యులు. వివిధ శాఖల అధికారులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: