అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న హుస్సేన్ నాయక్

విశ్వంభర,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి తో పాటు మండలంలో ఆదివారం,సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ పర్యటించి పలు సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు బిజెపి జిల్లా నేత గుగులోతు నవీన్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రం ఇనుగుర్తి లో ఈ నెల 19న బిజెపి నాయకులు, కార్యకర్తలతో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం పై హుస్సేన్ నాయక్ దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. 20న,మీట్యా తండాలో మండలంలోని 13 గ్రామ పంచాయతీల సర్పంచి ల తో ఆయా గ్రామాల సమస్యలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. గ్రామ పంచాయతీలకు స్ప్రే పంపులు వితరణ చేయనున్నట్లు వెల్లడించారు.మీట్యా తండా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం హుస్సేన్ నాయక్ సిఫారసుతో కెనరా బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రం(మినరల్ వాటర్ ప్లాంట్) హుస్సేన్ నాయక్, చేతుల మీదుగా ప్రారంభించి తండా గిరిజనులకు అంకితం చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి కెనరా బ్యాంక్ సిజిఎం హాజరవుతున్నట్లు తెలిపారు.సంబంధిత కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులు, బిజెపి శ్రేణులు, అభిమానులు సమస్యలు వివరించుకునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/hussain-naik-who-will-participate-in-development-programs/article-18899

Tags: