వైద్య శిరోమణి అవార్డు కు డాక్టర్ బి రవీంద్ర నాయక్  ఎంపిక 

విశ్వంభర, బషీర్ బాగ్: వైద్య , ఆరోగ్య , కుటుంబ సంక్షేమ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ బి. రవీందర్ నాయక్ జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రం నుంచి ఒక్కరికి ఇచ్చే ఈ అవార్డును జులై 1వ తేదీన ఉదయం 11 గంటలకు కోటి లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో వైద్య శిరోమణి అవార్డు 2026 ను ప్రదానం చేస్తున్నట్టు తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ నేడు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.  గత 35 సంవత్సరాలుగా నిరంతరంగా రోగరహిత సమాజం కోసం, నిరుపేదల ఆరోగ్య పరిరక్షణకు ఎన్నో అవగాహన శిబిరాలు ,ర్యాలీలు, సదస్సులు నిర్వహించి ఎన్నో  అందుకున్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో వైద్యరంగంలో అనేక సేవలందించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు. నిరుపేద ప్రజలను ఆరోగ్యం పట్ల చైతన్యవంతులను చేసేందుకు ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డు ప్రధానం చేస్తున్నట్టు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ తెలిపారు. ఉస్మానియా వైద్య కళాశాల నుండి ఎంబీబీఎస్, డిసిహెచ్ పూర్తి చేశారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dr-b-ravindra-naik-was-nominated-for-the-vaidya-shiromani/article-17439

Tags: