"చంద్రబాబు ఏజెంట్ రేవంత్ రెడ్డి"

విశ్వంభర, సిద్దిపేట: ఆంధ్ర సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల సాయిరాం, ఎడ్ల సోమిరెడ్డిలు విమర్శించారు. నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులు ఎల్లారెడ్డి, ఆంజనేయులు, కీసర పాపయ్యతో కలిసి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. హరీశ్‌రావు, తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమం గురించి సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలపై బేషరత్‌గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేసిన మోసం వల్లనే 1969లో 360మంది విద్యార్థులు, మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరులయ్యారన్నారు. ఉద్యమకారులపై తుపాకిని ఎక్కు పెట్టిన రైఫిల్ రెడ్డి, హరీశ్‌రావు ఉద్యమ ప్రస్థానంపై మాట్లాడడం ఆక్షేపనీయమన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డికి లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు దేవయ్య, సాయిప్రేమ్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chandrababus-agent-revanth-reddy/article-17364

Tags: