క్రమబద్ధీకరించాలని నిరసన
విశ్వంభర, గుండాల: తమను క్రమబద్ధీకరించాలని , ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారము భోజన విరామ సమయంలో మండల వనరుల కేంద్రం గుండాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ప్రతినిధి దేవన బోయిన లింగయ్య మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మొదటిరోజు పాఠశాల స్థాయిలో నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశాము , ఈనెల 16న జిల్లా కేంద్రంలో, ఈనెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు పేస్కేలు వేతనాలు చెల్లించడంతోపాటు గత సంవత్సరము 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల ఎం ఐ ఎస్ దేవన బోయిన నరేష్, కంప్యూటర్ ఆపరేటర్ హనీఫ్, మెసెంజర్ ముత్తయ్య, పి టి ఐ రాస కచ్చుల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.



