ఘనంగా ముగిసిన అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్

విశ్వంభర,  హైదరాబాద్ :నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా వారం రోజులుగా అత్యంత ఉత్సాహభరితంగా సాగిన '1వ ఐఎల్‌సిఎ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్', 'వైఏఐ 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2026' పోటీలు శనివారం వైభవంగా ముగిశాయి. ఈఎమ్‌ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు వేడుకలకు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కమాండెంట్, ఈఎమ్‌ఈ కోర్ కల్నల్ కమాండెంట్ మరియు కమోడోర్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్ణే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా జనరల్ వర్ష్ణే మాట్లాడుతూ, హుస్సేన్ సాగర్ వేదికగా భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఐఎల్‌సిఎ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. ఒలింపియన్లు, అర్జున అవార్డు గ్రహీతలను దేశానికి అందించిన ఘన చరిత్ర ఈఎంఈఎస్ఎకు ఉందని కొనియాడారు. సెయిలింగ్ క్రీడ కేవలం పోటీ మాత్రమే కాదని, అది క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలను నేర్పుతుందని పేర్కొన్నారు. "సముద్రాలను దాటాలంటే ఒడ్డును వదిలి వెళ్లక తప్పదు" అనే క్రిస్టోఫర్ కొలంబస్ మాటలను గుర్తు చేస్తూ, క్రీడాకారులు ధైర్యంతో కొత్త శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఈ పోటీలకు అంతర్జాతీయంగా మరింత ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఎంసీఈఎమ్‌ఈ ఆధ్వర్యంలో, ఐఎల్‌సిఎ మరియు వైఏఐ సహకారంతో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో దేశవిదేశాలకు చెందిన 19 ప్రముఖ ఆర్మీ, నేవీ, సివిలియన్ సెయిలింగ్ క్లబ్‌ల నుండి మొత్తం 124 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 19 మంది మహిళా నావికులు ఉండటం విశేషం. ఐఎల్‌సిఎ-7, ఐఎల్‌సిఎ-6 (పురుషులు & మహిళలు), మరియు ఐఎల్‌సిఎ-4 (బాలురు & బాలికలు) విభాగాలలో జరిగిన ఈ పోటీలు అత్యున్నత ప్రమాణాలతో సాగాయి. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడంతో పోటీ సెయిలింగ్‌కు హైదరాబాద్,ఈఎంఈఎస్ఎ ప్రధాన వేదికలుగా తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాయి.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/international/international-sailing-championship-ends-on-a-grand-note/article-18915

Tags: