రూ. 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

విశ్వంభర, ఇబ్రహీంపట్నం:- పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆపద సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కర్ణంగూడ గ్రామానికి చెందిన పండాల సత్తయ్య గౌడ్ కి రూ. 60,000/- చెక్కు మంజూరు అయ్యింది. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బందులు పడుతున్న సత్తయ్య గౌడ్ కుటుంబం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ని కలిసి తెలియజేయగా. వారి సమస్యను సానుభూతితో విన్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారు. మంజూరైన రూ. 60,000/- చెక్కును శనివారం సత్తయ్య గౌడ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్ణంగూడ గ్రామ సర్పంచ్ వంగేటి తిరుమల్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.సర్పంచ్ వంగేటి తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం, ఇతర సమస్యలు వస్తే వెంటనే నా దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని అర్హులకు అందజేసే బాధ్యత మాది. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో కర్ణంగూడ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నాం. సత్తయ్య గౌడ్ కుటుంబానికి ఈ సహాయం కొంత ఉపశమనం కలిగిస్తుందని అని అన్నారు. ఈ సందర్భంగా సత్తయ్య గౌడ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ ఆపద సమయంలో ఎలాంటి జాప్యం లేకుండా స్పందించి సహాయం అందించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ వంగేటి తిరుమల్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు యంపల్ల శ్రీపతి రెడ్డి, నాయకులు వంగేటి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-cm-relief-fund-check-of-rs-60000-will-be/article-18881

Tags: