చిన్నారుల పోషణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి
విశ్వంభర, చింతపల్లి: చిన్నారుల పోషణ పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు. చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషన్ అభియాన్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ లోపాల వల్ల చిన్న పిల్లలకు రక్త హినత బరువు తగ్గుట, ఎదుగుదలలో లోపం వంటి సమస్యలకి గురి అవుతున్నారని అన్నారు. పిల్లలకు సరైన పోషక పదార్థాలు అందించాలని ఆమె అన్నారు. గర్భిణి స్త్రీలు ఐరన్ కాల్షియం మాత్రలు తీసుకోవాలని క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ప్రసన్న లక్ష్మి, అంగన్వాడి టీచర్లు మర్రు వెంకటమ్మ, జూలురి స్వప్న, రావు లక్ష్మి, జెల్ల కవిత, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



