పుల్వామా ఉగ్రదాడి నిందితులను వెంటనే పట్టుకోవాలి

పుల్వామా ఉగ్రదాడి నిందితులను వెంటనే పట్టుకోవాలి


  • : ఆప్ నేత డా. సుధాకర్

విశ్వంభర, బషీర్ బాగ్ : పుల్వామా,  పహెల్గాం ఉగ్రదాడి నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ సలహాదారు, ప్రధాన అధికార ప్రతినిధి డాక్టర్ దిడ్డి సుధాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రతా లోపాలపై పారదర్శక నివేదిక విడుదల చేయాలన్నారు. ఉగ్రదాడులను రాజకీయ లాభాల కోసం వినియోగించడం వెంటనే ఆపాలన్నారు.దే శ భద్రతపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరులు,  వీర జవాన్లకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగం ఎప్పటికీ వృథా కావద్దని అన్నారు. ఈ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను ఇప్పటి వరకు పట్టుకోలేకపోవడం కేంద్ర ప్రభుత్వ ఘోర వైఫల్యమే అన్నారు. వారు వందల కిలోమీటర్లు దాటి ఎలా వచ్చారు, ఎలా పారిపోయారనీ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక్క నిందితుడిని కూడా పట్టుకోకపోవడానికి కారణం ఏమిటనీ,  ప్రభుత్వం వారిని చంపేసాం అని చెపుతున్నా, చంపినట్లు ఆధారాలు చూపలేదన్నారు. ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కనుసైగలతో యుద్దాన్ని ఆపేసిన మోడీ తన మనకిబాత్ లో పిఓకే ను స్వాధీనం చేసుకోకుండా యుద్ధం ఎందుకు ఆపారో సమాధానం చేప్పాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags: