మహేశ్వరంలో మేడే పోస్టర్ ఆవిష్కరణ
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి దత్తు నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తు నాయక్ మాట్లాడుతూ, 141 వ మేడే మహేశ్వరం నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతాలలో పెద్ద ఎత్తున ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు, సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, మహిళా కార్మికులకు రక్షణ, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇలాంటి అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలు రక్షించుకోవాలని కార్మిక వర్గానికి కోరడం జరిగింది. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల అనుకూలంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను కార్మికులందరూ రద్దు అయ్యేంతవరకు సంఘటితంగా పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్మ గళ్ళ రాజు బ్రహ్మచారి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కోటేష్, శ్రీశైలం, యాదయ్య, లింగం, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు



