ద్యతోపాటు సామాజిక అంశాల్లో అవగాహన అవసరం 

ద్యతోపాటు సామాజిక అంశాల్లో అవగాహన అవసరం 


  • జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

విశ్వంభర, మహబూబాబాద్ :  విద్యతోపాటు సామాజిక అంశాలపై విద్యార్థిని, విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20 నుండి 26 వరకు సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయిన నేపథ్యంలో రెండవ రోజు పత్తిపాక లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వసతి గృహంలోని స్టోర్ గది కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. కిచెన్ క్లీనింగ్, సానిటేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, పరిసరాల పరిశుభ్రత, హెల్మెట్, సీట్ బెల్ట్ రోడ్డు భద్రత, డ్రగ్స్ నివారణ తదితర అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించారు. సంక్షేమ పాఠశాలలో విద్యార్థుల యొక్క ప్రతిభను సృజనాత్మకతలను వెలికి తీయడం మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలు వివిధ సబ్జెక్టులలో జ్ఞానాన్ని, శీఘ్ర ఆలోచనా విధానాన్ని పరీక్షించడం కోసం క్విజ్ పోటీలు, బాలల హక్కుల, కార్యక్రమాలు, బాలల హక్కులు, విద్య, ఆరోగ్య అవగాహనపై వీధి నాటకాలు, సామాజిక న్యాయం, విద్య  పర్యావరణం - ఆంగ్లంలో , తెలుగులో చర్చ ప్రసంగాలు సామాజిక న్యాయ, ప్రకృతి , సంస్కృతి అంశాలపై సృజనాత్మక వ్యక్తీకరణ పై డ్రాయింగ్, పెయింటింగ్ తదితర అంశాలపై కార్యక్రమాలు నిర్వహించారు. కేవలం విద్య ద్వారానే క్రమశిక్షణ ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పట్టుదల ఏకాగ్రత తో విద్యను అభ్యసించాలని, అలాగే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు, అందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం సమయానుకూలంగా పుస్తకాలు చదవాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలను సన్మానించి ప్రశంసా పత్రాలను అందించారు. రోడ్డు భద్రత, డ్రగ్స్ నివారణ సామాజిక అంశాలపై నిర్వహించిన వ్యాసరచన క్విజ్ పోటీలలో గెలుపొందిన వారిని అభినందించారు. ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలలో కామన్ డైట్ మెనూ ప్రవేశపెట్టి పిల్లలందరికీ రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడం ద్వారా మంచి ఆరోగ్యంగా ఉంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు విద్యను అభ్యసించడం కోసం సంబంధిత విద్య సిబ్బంది ఏర్పాట్లు చేయాలని అన్నారు. పిల్లలకు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి, అట్టి నివేదికలను సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జెడ్పీ సీఈఓ పురుషోత్తం, కళాశాల ప్రిన్సిపల్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags: