పెన్షనర్లకు ఘనంగా సామూహిక జన్మదిన వేడుకలు

పెన్షనర్లకు ఘనంగా సామూహిక జన్మదిన వేడుకలు

విశ్వంభర, గుండాల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మోత్కూర్ యూనిట్ ఆధ్వర్యంలో సంఘ భవనంలో ఏప్రిల్ నెలలో జన్మదినం ఉన్న పెన్షనర్లకు సామూహిక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుత్తోజు గురుమూర్తి, జక్కుల బిక్షం, సు రోజు యాదమ్మ, కుకునూరు లక్ష్మారెడ్డి, శ్రీరంగం నర్సయ్య లకు జన్మదిన వేడుకలు జరిపి సన్మానించారు. ఈ వేడుకలు యూనిట్ అధ్యక్షులు బి. యాది రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించగా, జిల్లా ఉపాధ్యక్షులు అవిలిమల్లు  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో యూనిట్ ఉపాధ్యక్షులు టి. మనోహర చారి, కార్యదర్శి ఏ. వల్లభాయ్, కోశాధికారి యాదగిరి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి. రామ్ రెడ్డి, జిల్లా ప్రతినిధులు ఏ. సత్యనారాయణ, ఎస్. భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ, తమ జీవితంలో ఇదొక మధురమైన ఘట్టమని, ఇంతమంది మధ్య ఇలాంటి విధంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Tags: