సుశ్రుత గ్రామీణ వైద్యుల కరపత్రిక ఆవిష్కరణ
On
విశ్వంభర, గుండాల: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈనెల 28వ తేcదీన నిర్వహించనున్న జిల్లా కమిటీ సమావేశానికి సంబంధించి సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం గుండాల మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుండాల మండలం అధ్యక్షుడు పొడి శెట్టి వెంకన్న, జిల్లా కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు మరియు సంఘానికి చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గ్రామీణ వైద్యుల సమస్యలు, సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు



