పుస్తక ఆవిష్కరణకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
On
విశ్వంభర, తొర్రూరు: ప్రముఖ కవి వాగ్గేయకారుడు చిలుక భాస్కర్ తాను రచించిన పెద్ద వంగర చరిత్ర ను తెలిపే మావూరి మట్టి సింగారం గ్రంధావిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని తొర్రూరు లో కలిసి ఆహ్వానించారు. తన పూర్వ గ్రంథం తూరుపువాడ ను అందజేశారు. ఈ సందర్భంగా చిలుక భాస్కర్ మాట్లాడుతూ తన స్వగ్రామ పెద్దవంగర పూర్వ చరిత్ర తో కూడిన మావూరి మట్టి సింగారం నూతన గ్రంథమును అంకిత స్వీకారాని ఎమ్మెల్యే ను కోరగా అంగీకారం తెలిపిందని, గ్రంథావిష్కరణకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఆహ్వానించగా సానుకూలంగా స్పందించి తమ అంగీకారాన్ని తెలియచేసినందుకు రచయిత కృతజ్ఞతలు తెలిపారన్నారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రాంబాబు, గుండాల నర్సయ్య చిలుక సంజీవరావు వివిధ గ్రామాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.



