ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన..రుద్రా ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ వెల్లడి
విశ్వంభర, హానుమకొండ:- పెగడపల్లి డబ్బాలు క్రాస్ హనుమాన్ గుడి ఎదురుగా బంగారు మైసమ్మ గుడి సందులోని పీవీఆర్ రెసిడెన్సీలో రుద్రా ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ సౌజన్యంతో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు.ఈ సందర్భంగా రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరంలో శంకర కంటి వైద్యులు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు సుమారు 300 మందికి నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారని తెలిపారు. కంటి శుక్లాల ఆపరేషన్ కు రెఫర్ చేసిన వారిని మంగళవారం ఉచితంగా హైదరాబాద్ తీసుకుని వెళ్లి ఆపరేషన్ చేయించి మళ్ళీ వాళ్ళ ఇంటివద్ద విడిచి పెడతామని రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో శంకర హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది,రుద్ర ఫౌండేషన్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.



