10 లక్షల మద్యం పట్టివేత 

10 లక్షల మద్యం పట్టివేత 

  • బెంగళూరు హర్యానా డిసైన్స్ క్యాంటీన్ల నుంచి దిగుమతి
    డిఫెన్స్ ప్రీమియం లిక్కర్ ను బడా బాబులకు అమ్మకాలు

విశ్వంభర, జిహెచ్ఎంసి : అతను రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. పేరు దొడ్ల సురేష్ రెడ్డి  (48).  సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఈ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బెంగళూరు, హర్యానా డిఫెన్స్ క్యాంటీన్లో నుంచి ఖరీదైన ప్రీమియం లిక్కర్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చి బడా బాబులకు అమ్మకాలు  జరుపుతున్నారు. ఈ సమాచారం అందుకున్న  ఈ ఎస్ జీవన్ కిరణ్ , ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాష్ చందర్, ఎస్సై అఖిల్, సిబ్బంది కలిసి మంగళవారం తెల్లవారుజామున హస్తినాపురంలో ఒక ఇంట్లో దాచిపెట్టిన 361 ప్రీమియం మద్యం బాటిళ్ల ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం బాటిల్ల విలువ రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. హస్తినాపురంలోని శ్రీ రమణ కాలనీ, ఫేస్ టు  ఇంట్లో ఈ మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈ ఎస్ జీవన్ కిరణ్ తెలిపారు.  దొడ్ల సురేష్ రెడ్డి మాత్రం ఎక్సైజ్ పోలీసులు వచ్చారని పరారయ్యాడు. పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు పట్టుకున్నఎన్ఫోర్స్మెంట్ టీమును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ కాసిం, డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్లు, ఈఎస్. జీవన్ కీరణ్, శుబాష్ చందర్ రావు, ఎస్సై అఖిల్ లను అభినందించారు.

Tags: