వాటర్ ప్లాంటు  కోసం వినతి

వాటర్ ప్లాంటు  కోసం వినతి

విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని 8 వ వార్డులోని బాబు నాయక్ తండా, సాంక్రియా తండా ప్రజల కోసం ఆరోగ్య రక్షణ దృష్ట్యా, స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయాలని  జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ కి  8వ వార్డు బీజేపీ ఇంచార్జ్  డా. ధరంసోత్ సీతారాం నాయక్  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈ సమస్యపై  జాటోత్ హుస్సేన్ నాయక్  అత్యవసరంగా పరిగణించి, ఎస్టీ కమిషన్ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని, వాటర్ ప్లాంటు ఏర్పాటుకు సానుకూలంగా స్పందించి వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు . ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు 

Tags: