మిర్యాలగూడలో చలివేంద్రాలు ప్రారంభం
విశ్వంభర, మిర్యాలగూడ : మిర్యాలగూడలో ప్రస్తుత వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, నియోజకవర్గ ప్రజల మరియు బాటసారుల సౌకర్యార్థం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బి ఎల్ ఆర్ బ్రదర్స్* ఆధ్వర్యంలో పట్టణంలోని 7 ప్రధాన కూడలుల వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఐఏఎస్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ ప్రారంభించారు. అనంతరం బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 3వేల మందికి పంపిణీ చేసే ఉచిత పెరుగన్నం పంపిణీ 9వ రోజు కార్యక్రమంలో పాల్గొని పెరుగన్నం పంపిణీ చేసి ప్రజలు, నాయకులతో కలిసి పెరుగన్నం తిన్నారు. ఈ సందర్భం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా సామాన్య ప్రజలు, ప్రయాణికులు మరియు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని, వారి దాహం తీర్చేందుకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా పట్టణంలో ప్రతిరోజు 3 వేల మందికి ఉచిత పెరుగన్నం పంపిణీ చేయడం చాలా అభినందనీయం అన్నారు. నేను కూడా పెరుగన్నం తినడం జరిగింది, చాలా నాణ్యతగా ఉందని చాలా బాగా చేస్తున్నారు అని ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండటం మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల అదృష్టం అని వారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



