ఘనంగా మోడల్ స్కూల్ వార్షికోత్సవం

ఘనంగా మోడల్ స్కూల్ వార్షికోత్సవం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని వివేకానందాస్ డివైన్ మోడల్ స్కూల్ ఆవరణలో ప్రైమరీ, హైస్కూల్  వార్షికోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. కన్నుల పండువగా సాగిన ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా కేతేపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మమత, యోగా గురువు యోగేశ్వర్ గురూజీ హాజరయ్యారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంలో వార్షికోత్సవాలు దోహదపడతాయని అన్నారు. చిన్న వయసు నుంచే పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అద్భుతమని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో వివేకానందాస్ డివైన్ మోడల్ స్కూల్ కీలక పాత్ర పోషిస్తోంది అని పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను అభినందించారు. యోగేశ్వర్ గురూజీ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో గురువుల పాత్ర ప్రధానమైనదని, తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరించాలని, అతిగా పిల్లల్ని గారాబం చేయకూడదని అది విద్యార్థుల తిరోగతికి కారణం అవుతుందని నిరంతరం తమ పిల్లల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు ఉండాలని సూచించారు. ​వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. విద్యార్థిని విద్యార్థులు రకరకాల నృత్యాలు, ఏకపాత్రాభినయాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అస్మా, మల్లేష్, నాగరాజు, ముత్యాలు, సాయి, విద్యాసాగర్, సుధారాణి, అనిత, సునీత, శాంతి, రాజేశ్వరి, సరిత పారిజాత, గాయత్రి, ఉమా తదితరు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: