ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం

ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం

ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం

  •  : టీజేఈయూ అధ్యక్షుడు రాజిరెడ్డి

విశ్వంభర, హైదరాబాదు : ప్రజా ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తాం అని టీజేఈయూ అధ్యక్షుడు, ఐఎన్‌టీయూసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి తెలిపారు.  హైదరాబాదు బీఎన్ రెడ్డి నగర్ సాహెబ్ నగర్ జలమండలి కార్యాలయంలో మంగళవారం టీజేఈ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు విజయలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సభలో ట్రేడ్ యూనియన్ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధికారంలో కార్మిక అనుకూల ప్రభుత్వం ఉన్నందున యూనియన్ సమస్యలు పరిష్కార దిశగా కృషి చేయవచ్చని అన్నారు. యూనియన్ బలోపేతానికి మద్దతు అవసరమని, అధ్యక్ష పదవికి మద్దతు ఇవ్వాలని కోరారు. తాను పదవిలో ఉన్నా లేకపోయినా కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళ్లెం రాజిరెడ్డి (శ్రమశక్తి అవార్డు గ్రహీత), రాఘవేందర్ రాజు (జనరల్ సెక్రెటరీ), ఈ. చంద్రశేఖర్, సి. సతీష్, ఏ. శ్రవణ్ కుమార్, ఎం.డి. జహంగీర్, జయరాజ్, సి. రాజు, ఆనంద్ రెడ్డి, యాదయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Tags: