పాలమూరు బిడ్డ వంశన్న గొంతు పార్లమెంట్ లో పక్క
చెల్క చిక్కమారిలో ఎన్నికల ప్రచారం
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
విశ్వంబర,షాద్ నగర్ : ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చెల్క చిక్కమారి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిస్వార్థ ప్రజా నాయకుడు చల్లా వంశీచంద్ రెడ్డికి మద్దతుగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కోరారు. దేశ ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసి కాంగ్రెస్ ని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ న్యాయం చేసేందుకు కట్టుబడి ఉందని, అందుకోసం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ఖాజా ఇద్రిస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నరు.