విశ్వభారతి లా కాలేజీలో ఘనంగా స్నాతకోత్సవం

విశ్వభారతి లా కాలేజీలో ఘనంగా స్నాతకోత్సవం

విశ్వంభర, సంగారెడ్డి: పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా ప్రాంగణంలో శనివారం స్నాతకోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీ, డైరెక్టర్ లీగల్ సెల్,  ప్రొఫెసర్ డాక్టర్ బి. విజయలక్ష్మి హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ కళాశాల విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. విద్యార్థులు తమ పట్టాలను అందుకోవడంతో పాటు విద్యా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి స్మారక బంగారు, వెండి పతకాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ విజయలక్ష్మి మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో నైతిక విలువలు, సమాజం పట్ల బాధ్యత ఎంతో ముఖ్యమని విద్యార్థులకు సూచించారు.కార్యక్రమంలో విశ్వభారతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భవాని, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: