సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఛైర్మన్లు 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఛైర్మన్లు 

విశ్వంభర, వికారాబాదు : వికారాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వికారాబాద్, తాండూర్, పరిగి మున్సిపల్ ఛైర్మన్లు,  కౌన్సిలర్లు కలిశారు. పట్టణాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణ, డ్రైనేజ్, రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి విషయాలను ముఖ్యమంత్రికి వివరించారు. పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.

Tags: