బీజేపీ నేత  ఎండల లక్ష్మీనారాయణ అరెస్టు 

బీజేపీ నేత  ఎండల లక్ష్మీనారాయణ అరెస్టు 

విశ్వంభర, నిజామాబాద్: బాన్సువాడ పట్టణంలో శుక్రవారం జరిగిన ఘర్షణల నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను  పరామర్శించేందుకు బాన్సువాడ బయలుదేరిన బీజేపీ మాజీ శాసనసభ పక్ష నేత, బాన్స్వాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ ను మార్గమధ్యలో భిక్కనూరు పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషను కు తరలించారు.  ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఓ వర్గం అరాచకాలు పెట్రేగిపోయాయని అన్నారు.  పోలీసులు కూడా బాధితుల పక్షాన నిలువకుండా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి బాధితులపైనే అక్రమంగా వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Tags: