తెలంగాణ రాష్ట్ర స్థాయి వినియోగదారుల చైతన్య సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన నల్లగొండ జిల్లా పౌరసరఫరాల అధికారి  వి. వెంకటేశ్వర్లు

తెలంగాణ రాష్ట్ర స్థాయి వినియోగదారుల చైతన్య సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన నల్లగొండ జిల్లా పౌరసరఫరాల అధికారి  వి. వెంకటేశ్వర్లు

నల్గొండ,విశ్వంభర :-  ఆగస్ట్ 10 ,11 వ తేదీలలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర స్థాయి వినియోగదారుల చైతన్య సదస్సును నాగార్జున సాగర్ లోని విజయ విహార్ కాన్ఫరెన్స్ హల్  లో నిర్వహించనున్నారు. సదస్సు కు సంబందించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి వినియోగదారుల చైతన్య సదస్సు పోస్టర్ ను  నల్లగొండ జిల్లా పౌరసరఫరాల అధికారి  వి.వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (CATCO) ప్రధాన కార్యదర్శి ఏలే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా వినియోగదారులకు సంబంధించి పెద్ద ఎత్తున వినియోగదారుల రక్షణ చట్టం - 2019 పై  తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల  నుండి దాదాపు 350 వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, అధికారులు హాజరై  చైతన్య సదస్సు తో పాటు వర్క్ షాప్ ను విజయవంతం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి  ఎండి ముస్తాఫా, జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటి అధ్యక్షుడు ఏ. హిమగిరి, జిల్లా ప్రధానకార్యదర్శి అన్నెబోయిన మట్టయ్య, న్యాయవాది కట్టెకోల నర్సింహ్మారావు, DCIC కన్వీనర్ చింతమల్ల గురవయ్య,తదితరులు పాల్గొన్నారు. 

WhatsApp Image 2024-08-01 at 16.06.41

Read More రోగులను పట్టి పీడిస్తున్న ప్రవేట్ ఆసుపత్రులు 

    ఏలే మహేష్ నేత 
    సీనియర్ జర్నలిస్ట్ 
స్టేట్ ఛీఫ్ కరెస్పాండంట్ 
v3 న్యూస్ ఛానల్ & విశ్వంభర దిన పత్రిక 
సెల్ : 9705646377

 

Tags: